తొమ్మిదో రోజుకు చేరిన ఆదివాసీల దీక్ష
BDK: తమ భూములు తమకు అప్పగించాలంటూ అశ్వరావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్ష ఇవాళ్టితో 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇన్ని రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. భూములు దక్కే వరకు దీక్షను కొనసాగిస్తామని అన్నారు.