వీరవాసరంలో జనసేన కార్యకర్తల సమావేశం

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం ముచ్చిపురి గ్రామంలో శనివారం భీమవరం జనసేన ఇంఛార్జ్ పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలవగానే జన సైనికుల మీద ముత్యపురి అల్లర్లలో పెట్టిన కేసులను ఎత్తి వేస్తానని జనసేన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీతో పాటు పలువురు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.