ఈ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా నో ఫైన్
PMJDYతో సహా 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలకు కనీస నిల్వ నిబంధన లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఫైన్ ఉండదని, డిపాజిట్, విత్‌డ్రా, ATM సేవలకూ ఛార్జీలు ఉండవని పేర్కొన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు. లోక్‌సభలో రాత పూర్వక సమాధానం ఇచ్చారు.