సంఘ బహిష్కరణతో మహిళ ఆత్మహత్యాయత్నం

సంఘ బహిష్కరణతో మహిళ ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: మదనపల్లె మండలంలో మంగళవారం రాత్రి లీనా(30) అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొత్తపల్లి శాంతిపురానికి చెందిన లీనాపై సంఘంలోని కొందరు వేధింపులకు పాల్పడి బహిష్కరించడంతో తీవ్ర మనస్థాపానికి గురై మందులు మింగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.