VIDEO: ఢిల్లీ మృతులకు విద్యార్థుల శ్రద్ధాంజలి

VIDEO: ఢిల్లీ మృతులకు విద్యార్థుల శ్రద్ధాంజలి

SRD: ఢిల్లీలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన వారి సంతాప సూచకంగా నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళులు అర్పించారు. ఈ మేరకు రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం స్థానిక పాఠశాల హెచ్ఎం కిషోర్ మాట్లాడుతూ.. సమాజం శాంతిగా ఉండాలని అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తూ దేశ నిర్మాణానికి పాటుపడాలన్నారు.