టికెట్ల జారీకి "పోర్టబుల్ యంత్రం"

టికెట్ల జారీకి "పోర్టబుల్ యంత్రం"

HYD డివిజన్‌లో తొలిసారిగా కాచిగూడలో అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల జారీకి "పోర్టబుల్ యంత్రం"న్ని దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ప్రయాణికులు క్యూలో నిల్చొనే పని లేకుండా స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ఉండే టీటీఈని సంప్రదించి టిక్కెట్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది మొబైల్ థర్మల్ ప్రింట్ సాంకేతికతతో పని చేస్తుందని చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.