స్వచ్ఛరథాన్ని సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే
NTR: స్వచ్ఛ గ్రామ రూపకల్పనకు కూటమి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే స్వచ్ఛ రథాన్ని రెడ్డిగూడెంలో ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ప్రజలు తమ వద్ద ఉన్న పాత సామగ్రిని ఇచ్చి ప్రతిఫలంగా నిత్యావసరాలు పొందవచ్చన్నారు.