VIDEO: గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

VIDEO: గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

MHBD: కురవి మండలంలో రూ.1,50,000 విలువ గల 3కిలోల గంజాయి పట్టుకున్నట్లు సీఐ సర్వయ్య తెలిపారు. వివరాలిలా.. SIలు గండ్రాతి సతీష్, జయకుమార్ తమ సిబ్బందితో కురవి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పవన్ కృష్ణ, చందు అనే ఇద్దరు నెంబర్ ప్లేట్లు లేని బైకుపై ప్రయాణిస్తున్నారు. పోలీసులు వారిని ఆపి తనిఖీచేయగా బ్యాగులో గంజాయి లభ్యమైంది. ఇద్దరిని అరెస్ట్ చేశారు.