VIDEO: 'పల్లెకి పోదాం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: బిక్కవోలు మండలం కాపవరంలో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను, వెల్‌నెస్ క్లినిక్‌లను సందర్శించారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కరానికి కృషి చేసేందుకే 'పల్లెకు పోదాం' కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.