వీఏంఆర్డీఏ ఛైర్మన్‌ని కలిసిన ఎమ్మెల్యే
VZM: వీఏంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌ని ఎమ్మెల్యే శ్రీమతి అదితి గజపతి రాజు ఇవాళ మర్యాదపూర్వకలగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, పెండింగ్‌లో ఉన్న పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. అలాగే, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రస్తావించారు.