VIDEO: తంబళ్లపల్లెలో పెరుగుతున్న వైరల్ జ్వరాలు

VIDEO: తంబళ్లపల్లెలో పెరుగుతున్న వైరల్ జ్వరాలు

అన్నమయ్య: వాతావరణ మార్పుల కారణంగా తంబళ్లపల్లె మండలంలో వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అధికంగా ఈ జ్వరాల బారిన పడుతున్నారు. స్థానిక సీహెచ్‌సీలో రోజుకు 100 - 200 మంది వరకు ఒపీ నమోదు అవుతుండగా, వీరిలో ఎక్కువ మందికి జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్నాయని వైద్యులు ఇవాళ తెలిపారు. ప్రతిరోజూ 25 - 35 మందికి జ్వర నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.