‘జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు’
MLG: జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ కొరత లేదని జిల్లా సివిల్ సప్లై అధికారి షా ఫైజల్ హుస్సేన్ స్పష్టం చేశారు. వంట గ్యాస్ సరఫరాలో ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 18004257109కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నెల 23న జిల్లాలో 960 సిలిండర్లను వినియోగదారులకు అందించినట్లు ఆయన తెలిపారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ వినియోగాలకు వాడొద్దని హెచ్చరించారు.