బైక్, టిప్పర్ ఢీ.. నుజ్జు నుజ్జు అయిన తల
SDPT: హుస్నాబాద్ నుంచి ముల్కనూర్ వెళ్లే ప్రధాన రహదారి జిల్లెలగడ్డ సమీపంలోని మంగళపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న అద్దపు శ్రీనివాస్‌ను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొన్న ఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడని స్థానికులు తెలిపారు. శ్రీనివాస్ తల నుజ్జునుజ్జు అయి, మెదడు బయటకు వచ్చింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.