VIDEO: 'దళారులను ఆశ్రయించవద్దు'

VIDEO: 'దళారులను ఆశ్రయించవద్దు'

NTR: గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ చిన్ని ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా, కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సూచించారు. కొనుగోలు చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.