శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

TPT: శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం కల్యాణ మండపం నందు స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం చేపట్టి, రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు చేశారు.