రహదారి ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

రహదారి ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి అప్పన్నపాలెంలో రహదారి ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి.హెడ్ కానిస్టేబుల్ సూరిబాబు తెలిపిన వివరాల మేరకు ఎస్.కోట మండలానికి చెందిన టీ. రాము (58) విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం స్కూటీ పై కొత్తవలస వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. అందులో ఒకరికి గాయాలు కాగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.