రోహిత్, కోహ్లీ భవిష్యత్‌పై గంభీర్ క్లారిటీ

టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ భవిష్యత్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'వాళ్లు రాణిస్తున్నంత కాలం జట్టులో ఉండాలి. ఆడితే జట్టులో ఉంటారు. రాణిస్తున్న వారిని ఆడొద్దనే హక్కు కోచ్, సెలెక్టర్, చివరకు బీసీసీఐకి కూడా లేదు. జట్టును ఎంపిక చేయటం కోచ్ పని కాదు. సెలక్టర్ల పని. ఎంపికైన వాళ్లు దేశం కోసం రాణించేలా చేయటమే నా పని' అని పేర్కొన్నాడు.