కిరాణా షాపులో అక్రమ మద్యం పట్టివేత
NRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ కార్యకలాపాలను నిరోధించేందుకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది, మక్తల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మక్తల్ మండలం జక్లేర్‌లో ఓ వ్యక్తి నిర్వహిస్తున్న కిరాణా షాపులో అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న 33.24 లీటర్ల మద్యాన్ని (సుమారు రూ.25,000/- విలువ) స్వాధీనం చేసుకున్నారు.