త్వరలో జీవీఎంసీ వేసవి క్రీడా శిబిరాలు
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం త్వరలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో శిబిరాలు నిర్వహించి చిన్నారుల ప్రతిభను వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. శిబిరాల వ్యవధి, నిర్వహణ వివరాలు త్వరలో ప్రకటించనున్నామన్నారు.