కడారి గూడెం చెరువు ఆక్రమణపై బీజేపీ ఆగ్రహం
WGL: వర్ధన్నపేట మండలం కడారిగూడెం చెరువు ఆక్రమణపై అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఇవాళ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని, అధికార పార్టీ ప్రలోభాలకులోనై అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.