శివరూపిణి అవతారంలో విరుపాక్షి మారెమ్మ

శివరూపిణి అవతారంలో విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు టౌన్ పరిధిలో మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ వీరుపాక్షి మారెమ్మ సోమవారం సందర్భంగా శివరూపిణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. వేకువజామునే అర్చకులు అమ్మవారి శిల విగ్రహానికి ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత శివరూపిణి అవతారంలో అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.