టాప్‌లో కొనసాగుతున్న రషీద్ ఖాన్
ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. జోఫ్రా ఆర్చర్, కేశవ్ మహారాజ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత్ నుంచి కుల్దీప్ (6) ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ 11 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా, సిరాజ్ 14, 15 స్థానాల్లో నిలిచారు.