ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి

NZB: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతిని ఆదివారం సాలూర మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ డైరెక్టర్ భూమయ్య, ఫతేపూర్ మాజీ సర్పంచ్, సాలూర గ్రామ పెద్దలు, ముదిరాజ్ యువకులు పాల్గొన్నారు.