'సీసీఐ పిచ్చిపిచ్చి నిర్ణయాలు మానుకోవాలి'
SRD: సీసీఐ పత్తి రైతుల పట్ల పిచ్చిపిచ్చి నిర్ణయాలు మానుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంగళవారం డిమాండ్ చేశారు. ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పరిమితి అధిక దిగుబడులు సాధించిన రైతులకు నష్టం కలిగిస్తుందన్నారు. పత్తిలో తేమ శాతం 20 వరకు ఉన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు హరిగోస పెడుతున్న, నష్టం కలిగించే నిబంధనలు ఎత్తివేయాలని కోరారు.