'భవన నిర్మాణ కార్మిక సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా'

'భవన నిర్మాణ కార్మిక సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా'

GNTR: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ అన్నారు. పాతగుంటూరుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు వేజండ్ల కోదండ రామయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో సోమవారం నసీర్ ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.