ఆ రూ. 15,000కోట్లు పోయినట్లేనా..!
గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరిట ₹15,000CR మేర పలు ఏజెన్సీలు స్వాహాచేసినట్లు EX CS శాంతికుమారి కమిటీ తెలిపింది. ఇవి అప్పటి మంత్రులు, ప్రముఖుల బంధువులకు చెందినవిగా గుర్తించింది. నిధుల రికవరీ సహా వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ రిపోర్టును పక్కనపెట్టేసింది. ఇప్పుడున్న వారిలో కొందరికి దీనిలో భాగం ఉండడమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి.