సొమ్ము కాజేసిన కేసులో ఐదుగురు అరెస్టు
W.G: నకిలీ బంగారం చూపించి, బెదిరించి రూ.40 వేలు చోరీ చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ బోణం ఆది ప్రసాద్ తెలిపారు. నిందితులైన కర్ణాటకకు చెందిన శరణప్ప, కార్తీక్ ఉమాపతి, శశి కుమార్, రుద్రప్ప, సతవాడి సందీప్‌ను నిట్ సమీపంలోని జాతీయ రహదారిపై అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3,510 నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.