ఒంగోలులో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.358

ఒంగోలులో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.358

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని ఒకటో పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం చిమట నుంచి వచ్చిన 1,349 పొగాకు బేళ్లను వేలంలో నిలుపగా 1,179 పొగాకు బేళ్లను పలు కంపెనీల వారు కొనుగోలు చేశారు. పొగాకు వేలంలో 18 కంపెనీలు పాల్గొనగా.. కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.358, కనిష్ఠ ధర రూ.190, సరాసరిగా రూ.301.08 లభించిందని పొగాకు వేలం కేంద్రం అధికారులు బుధవారం తెలిపారు.