'వల్లాయి చెరువు అలుగుకట్టను తొలగించండి'

BDK: పినపాక మండలం సీతంపేట వల్లాయి చెరువు అలుగుకి నీరు పోకుండా కట్ట వేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వరద నీరు పంట పొలాల్లోకి చేరుతుందని అంటున్నారు. ఇలాగే ఉంటే దాదాపు 30 ఎకరాల మేర పంటకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెరువు నీరు వెళ్లేలా అలుగు కట్టను తొలగించాలని కోరుతున్నారు.