నిద్ర మాత్రలు మింగి వివాహిత ఆత్మహత్యాయత్నం

KDP: తండ్రితో గొడవపడి నిద్ర మాత్రలు మింగి వివాహిత ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మదనపల్లె ఎస్టేట్ సమీపంలోని, శివాజీ నగర్‌లో కాపురం ఉంటున్న రాధారాణి(32) కుటుంబ విషయమై తన తండ్రి మందలించాడని మనస్థాపం చెందింది. ఇంట్లో ఉన్న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో కుటుంబీకులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు.