కొలం సాలెగూడలో దుప్పట్ల పంపిణీ

కొలం సాలెగూడలో దుప్పట్ల పంపిణీ

ASF: ఆసిఫాబాద్ మండలంలోని కొలం సాలెగూడ గ్రామాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి శుక్రవారం సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై ప్రభుత్వ పథకాల అమలు, స్థానిక సమస్యలను సమీక్షించారు. పీఎం జన్మన్ ద్వారా మంజూరైన ఇళ్లకు భూమిపూజ చేశారు. అనంతరం ఓ ఫౌండేషన్ ద్వారా గ్రామంలోని 20 కుటుంబాలకు దుప్పట్లు పంపిణి చేశారు.