బెంగళూరులో AMB సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే?
ఏషియన్ సినిమాస్‌తో కలిసి సూపర్‌స్టార్ మహేష్‌బాబు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ‘AMB సినిమాస్’ మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇదే సంస్థ బెంగళూరులోనూ అడుగుపెడుతోంది. డిసెంబర్ 16న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. ఈ వేడుకకు హీరో మహేష్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.