తెలంగాణ సర్వోదయం కోసం కొత్త పార్టీ కావాలి: కవిత
MDCL: నూతన పార్టీపై కల్వకుంట్ల కవిత సంచలన వాఖ్యలు చేశారు. 'తెలంగాణ సర్వోదయం కోసం, ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేసే నూతన పార్టీ ఆవశ్యకత ఉందని బలంగా విశ్వసిస్తున్నాం. గతంలో తెలంగాణ జాగృతి ద్వారా అనేక పోరాటాలు చేశాం. ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అందరి కోసం నిలబడే కొత్త పార్టీ రావాల్సిన సమయం ఆసన్నమైంది, మేడ్చల్ మునీరాబాద్‌లో కొత్త పార్టీ ప్రకటిస్తాం' అని స్పష్టం చేశారు.