ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తున్న మంచు
కోనసీమ: శీతాకాలం వచ్చిందంటే పల్లెటూర్లు మంచుతో కాశ్మీర్ అందాలను తలపిస్తాయి. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గుత్తుల వారి పాలెంలో బుధవారం ఉదయం చేల మద్యలో పొగ మంచు చూస్తే ఆహ్లాదకరం అనిపించింది. ప్రకృతి అందాలకు పలువురు ప్రకృతి ప్రేమికులు తమ మొబైల్‌లో బంధించారు. శ్వాస కోశ వ్యాధులు ఉన్నవారు మంచులోకి వెళ్లకపోవడం మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు.