'సదరం సర్టిఫికెట్ల జారీలో అవకతవకలపై విచారణ చేయాలి'
నిర్మల్ జిల్లాలో సదరం సర్టిఫికెట్ల జారీలో అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతోందని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ఇవాళ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొంతమంది అక్రమంగా సర్టిఫికెట్లు పొంది పెన్షన్, ఉద్యోగాలు పొందారని ఆరోపించారు.