రేషన్ బియ్యం అక్రమ ఎగుమతి.. సిట్‌కు అదనపు సిబ్బంది

కాకినాడ నుంచి అక్రమంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యంపై విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఏర్పాటు చేసిన సిట్‌లో ఇప్పుడు అదనపు సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఐజీరవికుమార్ నేతృత్వంలో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు, పౌరసరఫరాల డీఎస్ఓ.డీఎం సభ్యులుగా ఉన్న ఈ బృందంలో తాజాగా ఒక డీఎస్పీతో పాటు మరో తొమ్మిది మంది వచ్చారు.