పీడీ యాక్ట్ కేసు నమోదు

BHNG: వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేంద్ర అనే వ్యక్తి అవసరాల కోసం కాంట్రాక్టర్లను, అధికారులను బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని రిమాండ్‌కు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు అతనిపై రాచకొండ పోలీసులు పిడి యాక్ట్ కేసు నమోదు చేశారు.