VIDEO: సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే

VIDEO: సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే

PLD: పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన 100 రోజులు-100 గ్రామాలు పర్యటనలో భాగంగా బుధవారం క్రోసూరు మండలం అందుకూరు గ్రామాన్ని సందర్శించారు. గ్రామ నాయకులతో సమావేశమై ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.