పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణద
SRD: జహీరాబాద్ సమీపంలోని రంజోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 20 నుంచి మే 11వ తేదీ వరకు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ గుప్తా తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై పాలీసెట్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉ.10 నుంచి మ.1:30 గంటల వరకు ఉచిత శిక్షణ జరుగుతుందని చెప్పారు.