స్వామివారిని దర్శించుకున్న ఐఏఎస్ అధికారి

కృష్ణా: ఆదిలాబాద్ ఐఏఎస్ యువరాజ్, దేవరకొండ ఏఎస్పీ మౌనిక దంపతులు ఆదివారం మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలోని నాగపుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకున్న వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తీర్థ ప్రాసాదాలు అందించారు.