చౌరస్తా విస్తరణకు రంగం సిద్ధం
RR: షాద్‌నగర్ పట్టణ చౌరస్తా విస్తరణ కార్యక్రమం త్వరలోనే అధికారులు చేపట్టే అవకాశాలు ఉన్నాయని మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్ అన్నారు. మంగళవారం HMDA శాఖకు చెందిన ఏఈ విశ్వతేజ సందర్శించి ప్రాంగణాన్ని పరిశీలించారు. చౌరస్తా విస్తరణ పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం అయిందని, అన్ని అవసరాలకు అనుగుణంగా ప్రజల సౌకర్యార్థం చేపట్టబోయే పనులు ప్రతిష్టాత్మకంగా నిలబడతాయన్నారు.