'ఎమ్మెల్యేపై దుష్ప్రచారం సహించం'
కృష్ణా: గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావుపై అసత్య దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య హెచ్చరించారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రైతు బజార్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తూ YCP నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.