మరో కేసులో ఐ బొమ్మ రవి
HYD: మూవీ పైరసీ కేసులో iBomma రవి అరెస్ట్ అవ్వగా, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే, పోలీసులు అతనిపై ఇప్పటికే ఐదు కేసులు నమోదు చేశారు. కాగా, తాజాగా పీటీ వారెంట్ వేసి, చంచల్ గూడ జైల్లో ఉన్న రవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో మళ్లీ 7 రోజులు కస్టడీ కావాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం రేపు తీర్పు ఇవ్వనుంది.