నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ప్రకాశం: కనిగిరి పట్టణంలో విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రామకృష్ణ తెలిపారు. టకారి పాలెం, కాశీపురం, ఎం.కె నగర్, దేవాంగ నగరం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.