భద్రాచలం అభివృద్ధికి రూ. 586 కోట్లు మంజూరు
BDK: తెలంగాణలో రామరాజ్య స్థాపనే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 586 కోట్లు కేటాయించిందని, తొలి దశలో రూ. 351 కోట్లతో పనులు చేపట్టనున్నామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతోందని తెలిపారు.