సీతానగరంలో మూడు రోజుల క్రీడా సంబరాలు

సీతానగరంలో మూడు రోజుల క్రీడా సంబరాలు

EG: సీతానగరం మండలంలో క్రీడా సంబరాలు మొదలుకానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంసద్ ఖేల్ మహోత్సవ్-2025లో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 16 నుంచి 18 వరకు అండర్-15, అండర్-21 విభాగాల్లో పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 16న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.