సొంత ఊరు రుణం తీర్చుకుంటున్న జవాన్లు
ADB: దేశానికి సేవలందించే జవాన్లు సొంత ఊరు రుణం తీర్చుకుంటున్నారు. దండేపల్లికి చెందిన జవాన్లు అల్లంల నరేష్, కట్ల తిరుపతి యువతకు తమవంతు సహకారం అందిస్తున్నారు. సెలవులపై ఇంటికి వచ్చిన వీరు ఆర్మీ అభ్యర్థులకు ఫిట్‌నెస్‌పై శిక్షణ ఇస్తూ.. మెలకువలు నేర్పుతున్నారు. గతంలో కూడా వారు ఇలానే గ్రామ యువతకు శిక్షణ ఇవ్వగా అందులో ముగ్గురు ఆర్మీలో కొలువు సాధించారు.