జనగణన కార్యక్రమం దేశ అభివృద్ధికి కీలకం: కలెక్టర్
JGL: జనగణన కార్యక్రమం దేశ అభివృద్ధికి కీలకమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కోరుట్ల ఆర్డీవో కార్యాలయంలో కొనసాగుతున్న జనగణన (Census), భూ స్వాధీన పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడి పనుల ప్రగతిని సమీక్షించారు. ఖచ్చితమైన సమాచారం సేకరణకు అధికారులు కట్టుబడి పని చేయాలన్నారు.