సూర్యాపేటలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

SRPT: సూర్యాపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాణిజ్య భవన్ పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి దంతాల చక్రధర్ (50) అనే వ్యక్తి మృతి చెందాడు. తహసీల్దార్ కార్యాలయం ప్రాంతానికి చెందిన చక్రధర్ మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.