సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎస్పీ

సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎస్పీ

ఏలూరు పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న పురాతన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, వారి సతీమణి సూర్య భవాని కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.